WWW.BHAVITA.ORG

WWW.BHAVITA.ORG

Sunday, July 18, 2010

ఈ క్షణం నా మనసు...

నీ చేయి అందించు – చిమ్మ చీకటి లో ఐనా ఒక కిరణం లా మెరుస్తాను  
నీ స్నేహాన్ని అందించు – సప్త సముద్రాలూ అవలీలగా దాటి వస్తాను

నీ మనసులో స్థానం ఇవ్వాలే కానీ ఈ జగమంతా రాజునై ఎదురు లేకుండా ఏలుతాను….

అదంతా ఒకప్పుడు.....
 విధి విలాసమో ఏమో , వెచ్చటి దుఖం తో బంధనాలు తెంచమని అడిగినా బదులు ఇవ్వని దేవుడు,

స్నేహితులు లేరు , ప్రేమ లేదు, బంధువులు లేరు  
మరి గుండె గోడ కింద మంటల సెగలు ఆపేదెవరు,

మరి ఇప్పుడు ----

సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అన్న ఒక మహేనీయుడి చివరి అడుగు నా ప్రస్థానం లో మొదటి అడుగు
ఈ సమాజం ఒక అద్భుతం
అందులో నేనొక యాత్రికుడిని, ఒక సమస్యని, ఒక అంతాన్ని, ఒక సూక్ష్మాన్ని
అంతరాలు తెలిసినా కూడా మనసు నిలకడగా లేదు...
కోపమెందుకు ప్రేమతో జయించు అన్నారు, కానీ ఆ ప్రేమ మీదే నమ్మకం లేనప్పుడు
ఆ ప్రేమ వల్ల కొందరు జీవితాలే కోల్పోతున్నప్పుడు, ఆ ప్రేమ తో దేనిని జయించాలి ఈ
బ్రష్టు పట్టిన సమాజంలో,


దీనికి సమాధానం బాంబు దాడిలో చనిపోయిన అమాయకుల కుటుంబాలను అడగాలా?
లేక యాసిడ్ దాడిలో గాయపడిన ప్రణీత ను అడగాలా?
కిరాతకుల చేతిలో బలయిన చిన్నారి నాగ వైష్ణవినా లేక చిన్నారి మృతిని తట్టుకోలేక మృతి చెందిన తండ్రి ప్రభాకర్ నా?