WWW.BHAVITA.ORG

WWW.BHAVITA.ORG

Sunday, March 7, 2010

పలకరింపు

నా పేరు ఆశ, నా ఆలోచనే నా శ్వాస, ఆ ఆలోచనలు ఎన్నో రకాలు, అందులో కొన్ని

* వూహ తెలియని వయసులో వేసవి సెలవలలో పల్లెటూరికి వెళ్ళినప్పుడు అక్కడి ఫ్రెండ్స్ తో చెప్పుకున్న దెయ్యం కధలు

* పల్లెటూరిలో వుండే వేసవి లో అమ్మే పుల్ల ఐస్ కొనుక్కుని దాని కోసం కొట్లాడి తిన్న జ్ఞాపకాలు

* మా తాత ఒల్లో మా ఇంటి అరుగు మీద కూర్చుని వున్న చిన్న జ్ఞాపకం
* మా తాతయ్య చని పోయిన తరువాత ఆ వూరిని వదిలి వచ్చిన గుర్తులు
* స్కూల్ కి వెళ్ళమంటే వెళ్లనని చేసిన గొడవ
* 7th క్లాసు లో నే హీరో రెంజేర్ సైకిల్, మారుతి ప్రసాద్ అన్నయ్య రోవర్ కార్, అంబాసిడర్
* నాకే క్రికెట్ బ్యాట్ & కిట్ వుండాలి అని అప్పుడే (ఆడటం రాకపోయినా) కొన్న పంతం

* ఇలా ఎన్నో చిన్న చిన్న చిలిపి సరదాలు, గొప్పలు, గొడవలతో గడిచిపోయిన న బాల్యం.

                   ఎన్నో ఆశలతో మొదలైన నా ఉద్యోగ జీవితం, మధ్యలో నే నా జీవితాన్ని మలుపు తిప్పిన యాక్సిడెంట్, 3 నెలలు నాకు తెలియని నా చుట్టూ పక్కల జరిగే విషయాలు, నాకు ఇక జీవితంలో మరల దొరకని రెండు అనుభూతులు
1 - వాసన తెలియదు 2 - రుచి కూడా తెలియదు, మెదడు లో వున్న రక్త నాళాలు,రక్తం గడ్డ కట్టి ఈ సమస్యలు,


వీటన్నిటిలో నాకు తోడుగా వుంటానని వాగ్దానం చేసి పట్టించుకోకుండా వదిలేసిన ఒక వ్యక్తి,
""ఒక అందమైన అమ్మాయి, జీవితాలతో ఆడుకుంటుంది , కానీ ఎందుకు ఆడుకుంటుందో, ఆ ఆటలో గెలుపు ఎవరిదో , కాలమే నిర్ణయిస్తుంది కదా... ఎదురు చూస్తూ వుంటాను""


ఇదే నా జీవితం , ఇన్ని సమస్యల నుండి పుట్టినదే BHAVITA ( www.bhavita.org ) అదే నా కసి కి రూపం , ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే తపన, ఎవ్వరు ఎన్ని చెప్పిన వినని నా దూకుడు స్వభావం తగ్గించుకుని ఏంటో ప్రశాంతంగా కనపడుతున్న నా లో ఇన్ని భావాలా, ఇంత ఉద్వేగమా


నాకు పరిచయం ఐన వారిలో కొద్ది మందితో మాత్రమే నేను సన్నిహితంగా వుంటాను , కానీ ఆ సరదా హద్దులు దాట కుండా చూసుకుంటాను, కానీ ఒక వేళ అది దాటింది అనిపిస్తే మాత్రం వాళ్ళని క్షమించమని అడగడానికి ఆలోచించను, ఎందుకంటే నేను వారిని నా సన్నిహితులు అనుకున్నాను కాబట్టి...