WWW.BHAVITA.ORG

WWW.BHAVITA.ORG

Saturday, May 29, 2010

మగవాడి మనసు....

మగవాడి మనసు మగువ మనసు లాగా సున్నితం కాదా?

మరపు అంటే ఏమిటో తెలియని అటువంటి మనసులతో మగువలకు ఎందుకు ఈ ఆటలు

తాను ప్రేమించిన పడతి పలకరిస్తేనే తమ మనసులు పులకరించి పోతాయే

ఆమె దరహాసానికి దాసోహం అంటారే,మరి అటువంటి వాళ్ళని ఇప్పుడు తప్పు చేశారు అంటున్నారు, ఏమి తప్పు చేశారు?

నీ అనుమతి లేకుండానే నీ ఆధారాలను అంటి పెట్టుకున్నాడా?


లేక నీకు తెలియకుండానే నీ శరీరం లో అణువణువు అర్పించావా?

కన్నవాళ్ల కళ్లుగప్పి తన కౌగిట్లో బందీ అయ్యినప్పుడు తెలియదా నువ్వు తప్పు చేశావని?


అన్న కు అబద్దం చెప్పి తన ఆతిధ్యం కోసం ఆరాట పడ్డావే?

నీ స్వరం వినడానికి , నీ సెల్ బిల్లు కట్టించావు.. ఎప్పుడూ ఏమో నా తప్పిదం లేదు అని తప్పించుకుంటున్నావు,

నువ్వు గాయపరచినది కేవలం ఒక మగవాడి మనసే కాదు నిన్ను మనసారా ప్రేమించే ఒక మనిషి మనసు అని ఎప్పుడు తెలుసుకుంటావు??


Sunday, May 23, 2010

రాజీ


ఏంటో మనసు లో ఈ వేదన,

మరిచిపోవాలని అనుకుంటూనే జ్ఞాపకాలలోకి జారిపోతుంది మనసు,


నడి రేయిలో వెన్నెల రాత్రుల్లో షికార్లు


గంటల కొద్ది సమయాన్నిక్షణాలుగా మార్చేసిన మాటల గలగలలు


మరిచిపోవాల్సింది తననా, తన జ్ఞాపకాలనా అనే ఒక చిన్న సంఘర్షణ


రెంటిని మరచి పోవాలి అని తట్టినప్పుడు మనసుని పిండేసే భావాలు


కళ్ళతో పలకలేని ఎన్నో భావల్ని పలికించడానికి


నా మనసు నేర్చుకున్న కొత్త భాష మౌనం... రాజీ పడక తప్పదేమో

Sunday, May 2, 2010

వీడలేక పోతున్నాను

జీవితం అంటేనే కొన్ని అనుభవాల సంగమం, నువ్వు కూడా నా జీవితం లో ఒక అనుభవం,

మొదట నిన్ను అంతగా పట్టించుకోలేదు, కానీ రోజులు గడిచే కొద్ది నువ్వు నాలో ఒక భాగం అయ్యావు,

నువ్వు ఎవ్వరికీ నచ్చలేదు కానీ నీతో ఈ బంధం వీడిపోయేది కాదు, చాలా మంది నిన్ను దూరంగా వుంచమన్నారు,

ఎన్నో జాగ్రత్తలు చెప్పారు , ప్రమాదం అన్నారు, అందరికీ నువ్వు పాతపడిపోయావు,

కానీ నాకు మాత్రం నువ్వు ఎప్పటికీ కొత్తే, నీ ప్రత్యేకతలు నీవి,
కొన్ని సార్లు నిన్ను సరిగా చూడలేదు నేను, నువ్వు నాతో వున్నావు అన్న విషయమే మర్చిపోయాను,

నీ నుండి శాశ్వతం గా విడిపోదాము అనుకున్నాను, కానీ మరలా నీ చెంతకే చేరుతాను,

ఇంకా నా వల్ల కాదు,నిన్ను అందరికీ పరిచయం చేస్తాను...

http://picasaweb.google.co.in/paveenp4u/Car#5466584921758159106